: ఆగని చైనా కవ్వింపు చర్యలు


భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన చైనా తన కవ్వింపు చర్యలను ఇంకా కట్టిపెట్టలేదు. తాజాగా లడఖ్ ప్రాంతంలో మరో గుడారం నిర్మించింది. దీంతో చైనా ఏర్పాటు చేసిన శిబిరాల సంఖ్య ఐదుకు చేరింది. కాగా, చైనా దళాలు తమ గుడారాల వెలుపల జాగిలాలతో పహారా ఏర్పాటు చేసుకున్నాయి. అంతేగాకుండా, భారత్ ను మరింత రెచ్చగొట్టేలా .. 'మీరు చైనాలో ఉన్నారు' అన్న బ్యానర్ ను తమ శిబిరం వెలుపల ఎగురవేశాయి.

కాగా, చైనా చొరబాటు విషయమై ఇరుదేశాల సైనికాధికారుల మధ్య ఇప్పటి వరకు మూడు పతాక సమావేశాలు జరిగినా నిష్ఫలమే అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో టెంటు నిర్మాణం భారత్, చైనా మధ్య మరింత ఎడం పెంచే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News