: నకిలీ డిగ్రీ కేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఊరట
నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఈ రోజు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్మృతి ఇరానీ డిగ్రీ చదవకుండానే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఈ రోజు న్యూఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు వాదనలు వింది. అనంతరం ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేసేందుకు నిరాకరించింది. సమన్లు జారీ చేయాలన్న ఈ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ డిగ్రీని పూర్తి చేసినట్లు స్మృతి ఇరానీ ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రతిపక్షాలు ఆమెపై ఎన్నో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.