: ‘వాట్సప్’ ద్వారా హైటెక్ వ్యభిచారం..గుర్ గావ్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు!


గుర్ గావ్ లో రహస్యంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. ‘వాట్సప్’ ద్వారా అమ్మాయిల ఫొటోలను విటులకు పంపిస్తుంటారు. ఆ అమ్మాయిల రేటు ఎంత? అనే విషయాన్ని కూడా ‘వాట్సప్’ ద్వారానే నిర్ణయించేస్తారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒక ప్రాంతంలో కలుసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గుర్ గావ్ లోని సెక్టార్ 51లో ఈ సెక్స్ రాకెట్ నడుస్తోందని చెప్పారు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారన్నారు. ఆ ఐదుగురిలో ఇద్దరు విదేశీ యువతులని చెప్పారు. అయితే, విదేశీ యువతలకు పాస్ పోర్ట్ లు లేవని, వారు ఇక్కడికి ఏ విధంగా వచ్చారనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ సెక్స్ రాకెట్ సూత్రధారులు ఎవరనే విషయం తమ దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News