: 'కపిల్ దేవ్' పాత్రలో నటించనున్న సల్మాన్ ఖాన్


బాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వస్తుండటంతో, ఈ తరహా సినిమాలు మరిన్ని చేయడానికి కథలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలతో వచ్చిన సినిమాలు బాక్సీఫీస్ వద్ద సందడి చేశాయి. సచిన్ టెండూల్కర్ బయోపిక్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో, భారత్ కు తొలి ప్రపంచకప్ ను అందించిన కెప్టెన్, మన దేశం నుంచి పుట్టుకొచ్చిన తొలి తరం ఫాస్ట్ బౌలర్, ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహకాలు జోరందుకున్నాయి. ఈ సినిమాలో కపిల్ పాత్రను స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పోషిస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' సినిమాలో సల్లూభాయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే... కబీర్ ఖాన్ దర్శకత్వంలోనే కపిల్ బయోపిక్ కూడా తెరకెక్కనుందని సమాచారం.

  • Loading...

More Telugu News