: జయలలిత మాట్లాడుతున్న వేళ... చెన్నైకి కదలనున్న నరేంద్ర మోదీ!
గత నెల 22వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత, ఆహారం తీసుకుంటున్నారని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారని వార్తలు వచ్చిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను పరామర్శించేందుకు వస్తున్నట్టు తెలిసింది. చెన్నై పాత ఎయిర్ పోర్టులోని వీఐపీ విమానాలు దిగే ప్రాంతం వద్ద భద్రత పెంచడం, అక్కడికి అధికారులు చేరుతుండటంతో మోదీ రాక వార్తకు బలం పెరుగుతోంది. మోదీ రానున్నారన్న వార్తలను తమిళనాడు బీజేపీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, ఆయన వస్తే, వైద్యులతో మాట్లాడటమే కాక, జయలలితనూ నేరుగా పరామర్శిస్తారని, ఆపై ఆయన నోటి వెంట జయ ఆరోగ్యంపై నమ్మకమైన సమాచారం వెలువడుతుందని అమ్మ అభిమానులు భావిస్తున్నారు.