: అలనాటి నటి జయచిత్ర కుమారుడి వివాహం
తమిళం, తెలుగు భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించి, అలరించిన అలనాటి హీరోయిన్ జయచిత్ర కుమారుడు అమ్రేష్ వివాహం రేపు చెన్నైలో ఆడంబరంగా జరగనుంది. గత నాలుగు దశాబ్దాల కాలంలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తూ ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమ్రేష్ ను కూడా హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో 'నానే ఎన్నుళ్ ఇల్లై' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా అమ్రేష్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అతనికి హీరోగా అవకాశాలు వచ్చినప్పటికీ, అతను మాత్రం సంగీతం వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం లారెన్స్ హీరోగా నటిస్తున్న 'మొట్టశివ కెట్టశివ' సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రేపు ఉదయం ఎగ్మోర్ లోని రాణి మెయమ్మై కల్యాణమంటపంలో అమ్రేష్ వివాహం జరగబోతోంది. సుదర్శన్, విజయశ్రీల కుమార్తెను ఆయన పెళ్లాడబోతున్నారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హజరుకానున్నారు. రేపు సాయంత్రం వివాహ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు.