: అమెరికాను నిలువరించే శక్తిగా ‘బ్రిక్స్’.. చైనా అధికారిక మీడియా కథనం
అగ్రరాజ్యం అమెరికాను నిలువరించగల శక్తిగా ‘బ్రిక్స్’ ఆవిర్భవించిందని చైనా అధికారిక మీడియా పేర్కొంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితులను అధిగమించి ప్రపంచ వాణిజ్యంపై బ్రిక్స్ దేశాలు తమదైన ముద్ర వేశాయని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధిపత్య ధోరణికి ఇక పుల్‌స్టాప్ పడినట్టేనని కథనంలో పేర్కొంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా ఆధిపత్య ధోరణులకు చెక్ పెట్టే స్థాయికి బ్రిక్స్ చేరుకోవడం హర్షణీయమంటూనే భారత్, బ్రెజిల్, రష్యా దేశాలు చైనా పెట్టుబడులను వ్యతిరేకించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి సంకుచిత ఆలోచనా ధోరణి బ్రిక్స్ దేశాల అభివృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.