: పాకిస్థాన్ కు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది: పారికర్
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. గత ఐదారేళ్లుగా వందల సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని... వాళ్లు ఎన్ని సార్లు వచ్చినా గట్టిగా బుద్ధి చెబుతున్నామని అన్నారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఒక భారత జవాను దుర్మరణంపాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న రాజౌరీ సెక్టార్లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో యూపీకి చెందిన సుదీష్ కుమార్ అనే జవాను మృతి చెందాడు. దీనికి సమాధానంగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని పారికర్ చెప్పారు. పీఓకేలోకి వెళ్లి సర్జికల్ దాడులు కూడా నిర్వహించామని తెలిపారు.