: పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదంటూ, వికారాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడం లేదంటూ ఓ వ్యక్తి ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వికారాబాద్‌లో కలకలం రేపింది. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఆవరణలో రాములు అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన డీఎస్పీ స్వామి వెంటనే స్పందించి రాములును దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాములు యాలాల్ మండలం రాట్నం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.