: డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కు యువకుడి వేధింపులు


డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ను ఒక యువకుడు వేధించిన సంఘటన ముంబైలోని వర్లి బీచ్ దగ్గర జరిగింది. వర్లి బీచ్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ఆ కానిస్టేబుల్ వద్దకు ఒక యువకుడు వచ్చి, ఆమె శరీర భాగాలను ముట్టుకుని పారిపోయేందుకు యత్నించడంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడి పేరు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. అతని వయసు మాత్రం 21 సంవత్సరాలని, నల్లసొపరకు చెందిన యువకుడని మాత్రం చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో అతను పనిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడని, బుధవారం లోకల్ కోర్టులో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కాగా, సదరు మహిళా కానిస్టేబుల్ కొత్తగా విధుల్లో చేరిందని సమాచారం.

  • Loading...

More Telugu News