: అన్నపూర్ణా స్టూడియోలో చిరంజీవి... హైదరాబాదు రోడ్లపై మహేశ్ బాబు


సాధారణంగా వారాంతాల్లో విశ్రాంతి తీసుకునేందుకు అంతా ఇష్టపడుతుంటారు. ఈ వీకెండ్ మాత్రం హైదరాబాదు నగరం షూటింగ్ లతో ఫుల్ బిజీగా మారిపోయింది. సుదీర్ఘ కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ కారణంగా వీకెండ్ షూటింగ్ లోనే ఎంజాయ్ చేశారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీలో రాయ్ లక్ష్మీతో పాటలో స్టెప్పులేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హైదరాబాదు రోడ్లపై సూపర్ ఫైట్ చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నటుడు సునీల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు' సినిమా కూడా తెరకెక్కుతోంది. హైదరాబాదులోనే జరుగుతున్న పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ లో శ్రుతిహాసన్ పాల్గొంటోంది. అక్షయ్ కుమార్, రానా, తాప్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'బేబీ' సీక్వెల్ షూటింగ్ లో తాప్సీ బిజీగా ఉంది. ఇందులో తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. చెన్నైలో 'అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్' షూటింగ్ లో శింబు, తమన్నా బిజీబిజీగా గడిపేశారు. ఈ వీకెండ్ కు ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా వీరంతా షూటింగ్ లోనే గడిపేశారు. వీరితోపాటు పలు చిన్న సినిమాల షూటింగ్ లు కూడా జోరుగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News