: సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ధోనీ, కోహ్లీ, రహానే
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారతకు మద్దతిస్తూ, తల్లి ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఈ ముగ్గురూ శ్రీకారం చుట్టారు. సరికొత్త ఆలోచన అంటూ ఓ ప్రచార వీడియోలో నటించిన ఈ ముగ్గురూ తమ తల్లి దేవిక (ధోనీ), సరోజ్ (విరాట్ కోహ్లీ), సుజాత (అజింక్యా రహనే) ల పేర్లు కలిగిన జెర్సీలు ధరించారు. అందులో భాగంగా 'జెర్సీలపై ధోనీ పేరు ఉండాలి కదా? దేవిక అనే పేరు ఉందేంటి? అని ఓ వ్యక్తి అడుగుతాడు. ఇన్నాళ్లూ అడగని ఈ ప్రశ్ని ఇప్పుడు కొత్తగా ఎందుకు అడిగావు? అంటూ...ఆ పేరు మా అమ్మది' అని ధోనీ గర్వంగా చెప్పిన వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.