: క్యూ కట్టిన న్యూజిలాండ్ ఆటగాళ్లు... 7 ఓవర్లు దాటకుండానే 3 వికెట్లు డౌన్


పెవీలియన్ కు చేరేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు పోటీ పడుతున్నారా అన్న పరిస్థితి కనిపిస్తోంది ధర్మశాలలో. ఓ వైపు పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుంటే, ఫోర్ల మీద ఫోర్లు వస్తున్నప్పటికీ, వరుస విరామాల్లో వికెట్లు పోతున్నాయి. ఓపెనర్ గుప్టిల్ ను పాండ్యా అవుట్ చేయగా, వన్ డౌన్ ఆటగాడు, కెప్టెన్ విలియమ్ సన్ ను, సెకండ్ డౌన్ ఆటగాడు టేలర్ ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. టేలర్ డక్కౌట్ కాగా, విలియమ్ సన్ 3 పరుగులకే పరిమితం అయ్యాడు. దీంతో 7 ఓవర్లు కూడా ముగియకుండానే న్యూజిలాండ్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లాథమ్ 17 పరుగులతో (16 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 35 పరుగులు.

  • Loading...

More Telugu News