: మా పొరుగే ఉగ్రవాదానికి మాతృమూర్తి: బ్రిక్స్ శిఖరాగ్రాన మోదీ
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాధి నేతలు కొద్దిసేపటి క్రితం శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపైనే ప్రధాని మోదీ ప్రసంగం సాగినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ను ఒంటరి చేయాలన్న ఆలోచనతో వ్యూహాత్మకంగా మాట్లాడిన మోదీ, ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు టెర్రరిజమేనని, భారత పొరుగు దేశమే ఉగ్రవాదానికి కన్నతల్లని ఆరోపించారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ, దీన్ని అరికట్టకుంటే, అభివృద్ధి మందగిస్తుందని చెప్పారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింతగా వాణిజ్య బంధాలు పెరగాలని అభిలషించిన ప్రధాని, అందుకు భారత్ ఎప్పుడూ ముందు నిలుస్తుందని అన్నారు. శిఖరాగ్ర సమావేశం ఇంకా కొనసాగుతోంది.