: పగలు వేడి, రాత్రి చలి... తెలంగాణలో వింతైన వాతావరణం


దాదాపు నెల రోజులుగా తెలంగాణ అంతటా విస్తరించి భారీ వర్షాలను కురిపించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వింతైన వాతావరణం ఏర్పడింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉంటుండగా, రాత్రి పూట ఉష్ణోగ్రత సాధారణంతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. దీంతో రాత్రుళ్లు మంచు పడుతూ, చలిపులి కమ్మేస్తుండగా, తెల్లారేసరికి మండుతున్న ఎండ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయాయని, ఒకటి రెండు రోజుల్లో మిగతా ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాలు వెళ్లిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం కనిపిస్తే, వింతైన వాతావరణంలో మార్పు వస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News