: మాల్‌తుమ్మెద గ్రామాన్ని మెదక్‌లో కలపాలంటూ ట్యాంక్ బండ్ పై యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పై ఈ రోజు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త ప్రాంతాలపై విన్నతులు ఇకపై పరిశీలించే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ప్రకటించారు. అయితే, మాల్‌తుమ్మెద గ్రామాన్ని మెదక్‌లో కలపాలంటూ సదరు యువకుడు ట్యాంక్‌బండ్ వద్ద నీటిలో దూకాడు. దీనిని గమనించిన అక్కడి సిబ్బంది యువకుడిని కాపాడి, పోలీసులకి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు యువకుడికి చికిత్స అందిస్తున్నారు.