: ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడిలో 31 మంది దుర్మరణం


షియా ముస్లింలే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో 31 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఈ మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. షియా ముస్లింలందరూ ఒక చోట గుమిగూడి ఉన్న చోట సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకుని విధ్వంసం సృష్టించాడు. ఏడవ శతాబ్దానికి చెందినా మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ మరణాన్ని తలచుకుంటూ ఓ టెంట్ లో షియాలు అశుర కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు సూసైడ్ బాంబర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తర బాగ్దాద్ లోని అల్-షాబ్ జిల్లాలో జనసందోహం ఎక్కువగా ఉండే ఓ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News