: సాయిబాబాను పూజించకూడదంటూ స్వరూపానంద మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సభలో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వరూపానంద షిర్డీ సాయినాథుడిపై మరోసారి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమైంది. సభలో స్వరూపానంద భక్తులకు హితభోద చేస్తూ సాయిబాబాను పూజించకూడదంటూ వ్యాఖ్యానించారు. దీంతో సాయి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి భక్తులు, స్వరూపానంద భక్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.