: ధోనీ కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు: గవాస్కర్
న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కఠిన పరీక్ష ఎదురుకానుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ కి గుడై బై చెప్పిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లను అతి తక్కువగా ధోనీ ఆడుతున్నాడని... దీంతో, తన పూర్వవైభవం చాటుకోవడానికి ధోనీ చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పాడు. 35 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించడం కూడా అత్యాశే అవుతుందని గవాస్కర్ తెలిపాడు. ఏ అథ్లెట్ అయినా 30 ఏళ్లు దాటిన తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పాడు. అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు సాధించిన గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్ కూడా వయసు పైబడే కొద్దీ అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. రేపటి నుంచి ప్రారంభమవుతున్న వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేశాడు.