: భారత్ చేరుకున్న చైనా అధ్యక్షుడు... మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న జిన్ పింగ్
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ చేరుకున్నారు. గోవా ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు భారతీయ సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా జిన్ పింగ్ భారత ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ పాల్గొంటారు. ఎన్ఎస్జీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, పాక్-చైనా ఆర్థిక కారిడార్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, బ్రిక్స్‌లో పాల్గొనడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకుబ్ జుమా, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు కూడా గోవా చేరుకున్న విషయం తెలిసిందే.