: చెవిలో పువ్వులు పెట్టుకొని హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన


స్వచ్ఛ హైదరాబాద్ నామ్‌కా వాస్తేగా మారిందంటూ ఈ రోజు ఉద‌యం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు వినూత్నంగా నిర‌స‌న‌లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం ముందు వారు చెవిలో పువ్వులు పెట్టుకొని ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సుధీర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్‌, భిక్షపతి గౌడ్ తదితరులు ఉన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో పారిశుద్ధ్యంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రచార ఆర్భాటంలో భాగంగానే ప్ర‌భుత్వం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింద‌ని మండిప‌డ్డారు. న‌గ‌రాన్ని దోమల నగరంగా మార్చారని విమ‌ర్శించారు. తెలంగాణ స‌ర్కారు తీసుకొచ్చిన‌ గ్రీన్ టాయిలెట్లు నిరుపయోగంగా ఉన్నాయ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News