: కాశ్మీర్ లో తొలిసారి చైనా జెండాల ప్రదర్శన!


కాశ్మీర్ లోని వేర్పాటువాదులు, అల్లరిమూకల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఇప్పటి వరకు కాశ్మీర్ లోయలో పాకిస్థాన్ జెండాలతో పాటు అప్పుడప్పుడు ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరడం మనకు తెలిసిందే. ఇప్పుడు అక్కడ కొత్త పోకడలు కనిపించాయి. బారాముల్లా ప్రాంతంలో నిరసనకారులు పాక్ జెండాలతో పాటు, చైనా జెండాలను కూడా ఊపుతూ ర్యాలీ నిర్వహించారు. చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సందర్భంలో ఈ పోకడలు కనిపించాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు పాక్, చైనా జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. కొన్ని జెండాలపై చైనా సాయం కావాలని కోరుతున్నట్టు రాతలు కూడా ఉన్నాయి. ర్యాలీ సందర్భంగా జెండాలు పట్టుకున్న వారు తమ ముఖాలు కనిపించకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. అంతేకాదు, విధుల్లో ఉన్న పోలీసులపై కూడా ఈ అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

  • Loading...

More Telugu News