: కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. పాంపోర్ ఆపరేషన్ ముగిసిన 48 గంటల్లోపే సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యం చేసుకుని దాడికి తెగబడ్డారు. శ్రీనగర్ శివారులోని జకుర ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ) వాహన శ్రేణిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు క్యాంపు నుంచి తిరిగి వస్తుండగా మాటువేసిన ఉగ్రవాదులు దాడికి దిగారు. జవాన్లు ప్రతిస్పందించేందుకు ఏమాత్రం వ్యవధి ఇవ్వని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సైనికులు వారిని చుట్టుముట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.