: జాన్సన్‌ అండ్ జాన్సన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ


తెలంగాణ‌కు పెట్టుబ‌డులను తీసుకొచ్చే దిశగా అమెరికాలో పర్యటిస్తోన్న రాష్ట్ర‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు పలు కంపెనీల అధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో పర్యటిస్తోన్న ఆయన ఈ రోజు ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా ఓ ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని ఆ కంపెనీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర‌ం నుంచి డయేరియా నిర్మూలన కోసం త‌మ సహకారం ఉంటుంద‌ని మెర్క్‌ కంపెనీ కూడా ప్రకటించింది. రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ న‌గ‌రంలో ఆ కంపెనీ వ్యాక్సిన్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News