: ఈజిప్ట్ ఆర్మీపై ఉగ్రదాడి.. 12 మంది మృతి
ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట దాడులు చేస్తూ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సైనిక శిబిరాలపైన, సామాన్యులపైన విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా, ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆర్మీ చెక్ పాయింట్ వద్దకు ప్రవేశించిన ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 12 మంది ఈజిప్ట్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులని అక్కడి అధికారులు తెలిపారు.