: అసలు జగన్ కు అంత ఆస్తి ఎక్కడిది?: ఏపీ మంత్రి పల్లె


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు అంత ఆస్తి ఎక్కడిదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నల్లధనంపై జగన్ ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నల్లధనంపై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారే తప్ప ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. దేశంలో అత్యధిక పన్నులు కడుతున్న వారిలో జగన్ మూడో స్థానంలో ఉన్నారని, ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టాటా, బిర్లాల మాదిరిగా జగన్ ఎలాంటి వ్యాపారాలు చేయలేదని, తనతండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించడం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని పావుగా చేసుకుని జగన్ వేలకోట్లు సంపాదించాడని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News