: పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు దిగండి.. మీరు గెలిస్తే 2019లో నేను పోటీ చేయను: కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి


దమ్ముంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి టీఆర్ఎస్ మళ్లీ ఎన్నిక‌ల‌కు దిగి గెలవాలని నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సవాలు విసిరారు. న‌ల్గొండ జిల్లాలో పార్టీ మారిన వారంద‌రూ రాజీనామా చేసి, మళ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే తాను 2019 లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ‌బోన‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. స‌ర్వేల పేరుతో కేసీఆర్ కాలం గ‌డుపుతున్నారని, ప్ర‌జా సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా గ‌జ్వేల్‌లోనూ కేసీఆర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. 31 జిల్లాలు కాదు.. 131 జిల్లాలు ఏర్పాటు చేసినా టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌దని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు. రైతు రుణ‌మాఫీ చేయ‌నందుకు కేసీఆర్‌కు ఓట్లు వేయాలా? ఆరోగ్యశ్రీని ప‌ట్టించుకోనందుకా? అని ఆయన విమ‌ర్శించారు. రూ.70 వేల కోట్ల కాంట్రాక్ట్‌ల‌ను కేసీఆర్ ఆంధ్రావారికి క‌ట్ట‌బెట్టారని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News