: మధ్యప్రదేశ్‌లో నీటి కుంట‌లో ప‌డిన బ‌స్సు.. 17 మంది మృతి


మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఈ రోజు ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ర‌త్లాం గుండా మాండ్‌స‌వుర్ వెళుతున్న ఓ బ‌స్సు అదుపుతప్పి నీటి కుంట‌లో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది ప్ర‌యాణికులు మృతి చెంద‌గా మిగ‌తావారికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న స్థానికులు, పోలీసులు బస్సును వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేప‌ట్టారు. గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News