: బంగారుపాళ్యంలో దారుణం.. బాలికపై అత్యాచారం, హత్య
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలో దారుణ ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని కామాంధులు కొందరు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను అత్యాచారం చేసి తరువాత హత్యచేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రవికుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పలు వివరాలు సేకరించి, ఆ ఘటనపై ఆరా తీశారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.