: హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయలో దారుణం... ఇద్దరు కలసి ఒక విద్యార్థిని చితక్కొట్టిన వైనం!


హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయలో దారుణం చోటుచేసుకుంది. విద్యాలయంలో సంస్కారం నేర్చుకోవాల్సిన విద్యార్థులు... సంస్కారాన్ని మరిచి తమ సహాధ్యాయిని, దారుణంగా కొట్టిన ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తరగతి ముగిసిన తరువాత ముగ్గురు విద్యార్థుల మద్దతుతో ఇద్దరు విద్యార్థులు కలసి ఒక స్టూడెంట్ ను కాలితో తన్నుతూ, మోచేతులతో, పిడికిళ్లతో అత్యంత దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో కాసేపటి క్రితం అప్ లోడ్ అయింది. ఈ వీడియోను ఒక విద్యార్థి తీశాడు. కాగా, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ విద్యార్థులు ఎవరు? జరిగిన గొడవ ఏంటి? ఎందుకంత క్రూరంగా కొట్టారు? వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, వారు ధరించిన యూనిఫాం ప్రకారం వారిని హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయాకు చెందిన విద్యార్థులుగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News