: అశ్విన్ 'లగాన్' జట్టులో కోహ్లీ, సాహా, కేన్ విలియమ్సన్, శ్రీనివాసన్
బాలీవుడ్ లో 2001లో విడుదలై రికార్డుల దుమ్ముదులిపిన లగాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. అమీర్ ఖాన్ ప్రదాన పాత్రలో అశుతోష్ గోవారికర్ రూపొందించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా నేపథ్యం క్రికెట్ కావడంతోను, తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంతోను సోషల్ మీడియాలో 'లగాన్ వీడియో' పేరిట ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసిన అశ్విన్ దీనిని చూసి ఎక్కడ నవ్వడం ఆపాలో కూడా తెలియడం లేదని పేర్కొన్నాడు. ఈ వీడియోలో లగాన్ లో భువన్ పాత్రలో కోహ్లీని చూపించగా, కచ్రా (అవిటి స్పిన్నర్) పాత్రలో అశ్విన్ ను చూపించారు. అలాగే ఈ వీడియోలో కీపర్ గా సాహా, కేన్ విలియమ్సన్ వంటి న్యూజిలాండ్ ఆటగాళ్లు కొందరు కనిపిస్తారు. వీరితోపాటు మాజీ ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ కూడా కనిపించడం విశేషం.