: ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్ సాంబశివరావు కన్నుమూత
అనారోగ్యం కారణంగా ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్ సాంబశివరావు(89) ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు ప్రాంతంలోని తులసీనగర్ లో ఉన్న కుమారుడి ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు దాదాపు 600కు పైగా చిత్రాలకు ఆయన పనిచేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన అద్భుతమైన పోరాట దృశ్యాలు రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు.