: ముంబయిలో కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద ఏడుగురు వ్యక్తులు
ఐదు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటన ఈరోజు ఉదయం ముంబయి బాంద్రాలోని బెహ్రంపడాలో ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం పూర్తిగా కూలిపోవడానికి ముందే ప్రమాద సూచనలు గమనించిన అగ్నిమాపక సిబ్బంది అందులోంచి ప్రజల్ని బయటికి తరలించారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.