: సికింద్రాబాద్ లో విషాదం.. మెట్రోరైల్ పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి
సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్లర్ వేయడానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ అందులో పడ్డాడు. దీనిని గమనించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. సదరు బాలుడి వయసు ఆరు సంవత్సరాలుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.