: జగన్ 12 సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు: మంత్రి దేవినేని
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ నీతి, నిజాయతీల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నల్లధనం, అక్రమాస్తులపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. జగన్ రూ.10వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వాటిపై జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ లాంటి రాజకీయ నేత దేశంలో ఎక్కడా లేరని దేవినేని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అధికమొత్తంలో అక్రమాస్తులు సంపాదించాడని, ఆయన 12 సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు.