: కోడలు పెట్టే వేధింపులకు తాళలేక కుటుంబమంతా ఆత్మహత్య!


కోడలు చేస్తున్న బెదిరింపులు తట్టుకోలేక ఒకే కుటుంబంలోని ఐదుగురు మత్తుమందు ఇంజక్షన్ తీసుకుని మరణించడం రాంచీలో సంచలనం కలిగించింది. ఆత్మహత్యాయత్నం చేసి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ డాక్టర్ సుకాంత సర్కార్ (65) తెలిపిన వివరాల ప్రకారం, తమ కోడలు వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుండేది. తాను, తన కుమారుడు సమీర్ (35)లు కలసి తన సోదరి మౌమిత (35)తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తుండేది. ఆమె ఆరోపణలకు ఓ స్వచ్ఛంద సంస్థ కూడా తోడు కావడంతో వేధింపులు పెచ్చుమీరాయి. దీంతో నోయిడాలో ఉంటున్న అందరూ రాంచీ వచ్చి అందరూ కలసి చచ్చిపోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. తాను వద్దని చెప్పేందుకు యత్నించినా ఎవరూ వినకపోవడంతో చేసేదేమీ లేకపోయిందని సర్కార్ తెలిపాడు. మత్తు ఇంజక్షన్లు తీసుకోవడంతో సర్కార్ భార్య అంజన (60), సమీర్, మౌమిత, ఆమె కూతురు సుమిత (5), సమీర్ కుమార్తె సమీత (7)లు మరణించగా, సర్కార్ ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్కార్ పూర్తిగా కోలుకున్నాక ప్రశ్నిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News