: ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ ల మధ్య శ్రుతి మించిన రొమాన్స్... 'నో' చెప్పిన సెన్సార్ బోర్డ్
ఇటీవల విడుదలైన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా టీజర్ వేడి పుట్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ సంచలనంగా మారింది. అందాల ఐశ్వర్య రాయ్, యువ హీరో రణ్ బీర్ కపూర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఐశ్వర్య అందాలకు తోడు, ఘాటు ముద్దు సన్నివేశాలు కూడా ఉండటంతో ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగాయి. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'బులెయా' పాటలో హాట్ హాట్ గా కనిపించిన ఐష్ ను చూసి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే, ఈ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐశ్వర్య, రణ్ బీర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లు శృతి మించాయని సెన్సార్ బోర్డు కన్నెర్ర చేసింది. సినిమాలో అసభ్యంగా అనిపించిన మూడు సన్నివేశాలను తొలగించి, యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. సెన్సార్ బోర్డు నిర్ణయంతో దర్శకుడు కరణ్ జొహార్ షాక్ కు గురయ్యాడు. ఈ సినిమాకు ఆ మూడు సన్నివేశాలే అత్యంత కీలకమని బోర్డుతో వాదించాడు. అయినా ఫలితం లేకపోయింది. సెన్సార్ బోర్డు ఏ మాత్రం తగ్గలేదు. తమ నిర్ణయం సరైందే అని తేల్చి చెప్పింది. ఈ దీపావళికి 'యే దిల్ హై ముష్కిల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.