: జయలలిత ఆరోగ్యంపై వదంతులు.. మరో ఇద్దరి అరెస్టు
గతనెల 22 నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఆగడం లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులకి ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్నాడీఎంకే నేతలు అదే సోషల్ మీడియా ద్వారానే 'మై సీఎం ఈజ్ ఫైన్.. నో మోర్ రూమర్స్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ పలువురు వదంతులను పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యంపై అభ్యంతరకర పోస్టులు చేసిన మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.