: 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ అదుర్స్.. మామ బాలకృష్ణపై లోకేష్ అభినందనల వర్షం
తన మామ, హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం టీజర్ ను వీక్షించిన లోకేష్, చిత్రంలో బాలకృష్ణ గెటప్, లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయంటూ తన ఆనందాన్ని తెలిపారు. శాతకర్ణి రూపంలో మామయ్యను చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని, సినిమా వచ్చే వరకూ తాను ఆగలేనని అన్నారు. చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.