: ఖ‌మ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళ‌న‌... అద్దాలు, సామ‌గ్రి ధ్వంసం.. నిలిచిన పత్తి కొనుగోళ్లు


ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఈరోజు ఉద్రిక్తత నెల‌కొంది. త‌మ‌కు న‌ష్టం వ‌చ్చే విధానాలు చేప‌డుతున్నారంటూ ప‌త్తి వ్యాపారులు ఆందోళ‌నకు దిగారు. దీంతో అందులోని ప‌త్తి యార్డులో ప‌త్తి కొనుగోళ్లు నిలిచాయి. ఈ-నామ్ విధానాన్ని వారు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఆ విధానం ఆమోద‌యోగ్యం కాదని వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు. పాత విధానంలోనే ప‌త్తి కొనుగోళ్లు కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అంత‌వ‌ర‌కు త‌మ వ్యాపారం కొన‌సాగ‌ద‌ని చెబుతున్నారు. మార్కెట్లో అద్దాలు, సామ‌గ్రి ధ్వంసం చేశారు. త‌మ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News