: 8 గంటల ప్రత్యక్ష నరకం అనుభవించిన మోనికా... శరీరంపై ఎక్కడపడితే అక్కడ పంటి గాట్లు


ప్రముఖ పర్ఫ్యూమర్ మోనికా ఘర్డే 8 గంటల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారని గోవా పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో మోనికా ఫ్లాట్ లోకి నిందితుడు రాజ్ కుమార్ సింగ్ ప్రవేశించాడని, 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఆమెను హత్య చేశాడని తెలిపారు. ఈ క్రమంలో, దాదాపు 8 గంటల సేపు మోనికాకు రాజ్ కుమార్ నరకం చూపించాడని చెప్పారు. అతను ఫ్లాట్ లోకి ప్రవేశించగానే సహాయం కోసం మోనికా గట్టిగా అరుస్తుండగా... ఆమె నోరు నొక్కేసి, కత్తితో బెదిరించాడని తెలిపారు. రాజ్ కుమార్ ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మోనికా శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పంటి గాట్లు ఉన్నాయి. దీంతో, పరీక్షల కోసం గోవా దంత వైద్యశాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. ఆమె శరీరం మీదున్న పంటి గాట్లతో అతని పళ్ల సైజు కూడా సరిపోయినట్టు తేలింది. దీంతో, రాజ్ కుమార్ పై హత్యతో పాటు అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 376), దోపిడీ (సెక్షన్ 392)ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News