: మొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాష్‌కు భారీ భద్రత
మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడైన మొద్దు శీనును జైలులో హత్య చేసిన మల్లెల ఓం ప్రకాష్‌కు భారీ పోలీసు భద్రతను కల్పించారు. మూడు నెలలుగా విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో ఉంటున్న ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో డయాలసిస్ కోసం ఆయనను బుధ, శనివారాల్లో విశాఖ కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారు. నిందితుడితో పోలీసులు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఆయనను నిందితుడిలా చూడడం లేదంటూ వస్తున్న వార్తలతో స్పందించిన పోలీసు అధికారులు ఓంప్రకాష్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏఆర్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను రక్షణగా నియమించారు. పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శీనును అనంతపురం జిల్లా రాప్తాడు జైలులో ఓంప్రకాశ్ హత్య చేసిన సంగతి తెలిసిందే.