: హైదరాబాద్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. పట్టుబడిన యువతులు.. రెస్క్యూ హోంకు తరలింపు


ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్ల మధ్యలో వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకులను, యువతులను, విటుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పి.బిశ్వాస్‌ హైదరాబాదు, చైతన్యపురిలోని ప్రభాత‌నగర్‌ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిర్వాహకుడు బిశ్వాస్‌తో పాటు ఖైరతాబాద్‌కు చెందిన విటుడు కృష్ణ కబీర్, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళలను రెస్య్యూహోంకు తరలించారు. వ్యభిచార గృహం నిర్వహణలో ప్రధాన సూత్రధారులైన బాలానగర్ వాసి పింటు, రాజ్ మండల్ అలియాస్ రసూల్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News