: షిర్డీ సాయికి బంగారు కిరీటం.. కానుకగా సమర్పించిన ప్రవాసాంధ్రుడు


షిర్డీ సాయినాథునికి ప్రవాసాంధ్రుడు బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అట్లూరి వెంకట్ సుహాన్ 748 గ్రాముల బంగారు కిరీటాన్ని మంగళవారం స్వామి వారికి సమర్పించారు. ఈ కిరీటంలో రూ.20 లక్షల విలువైన ముత్యాలు పొదిగారు. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షిర్డీ సందర్శించిన వెంకట్ హారతి సమయంలో కిరీటాన్ని అందజేశారు. ఈ మేరకు సాయి సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది.

  • Loading...

More Telugu News