: ప్రతి మగాడు ఈ మూడు దశలు అనుభవించాల్సిందే: కార్తీ


ప్రతి మగాడి జీవితంలో మూడు కీలక దశలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ దాటాల్సిందేనని సినీ నటుడు కార్తీ తెలిపాడు. తన తాజా సినిమా 'కాష్మోరా' ప్రమోషన్ లో భాగంగా కార్తీ మాట్లాడుతూ, బ్యాచులర్ గా జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశానని ప్రతి ఒక్కరూ భావిస్తారని అన్నాడు. ఆ తరువాత వివాహం చేసుకుని భార్యకు ఇష్టమైనవన్నీ చేస్తాడని చెప్పాడు. ఆ తరువాత పిల్లలు పుడితే మొత్తం ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయని చెప్పాడు. ప్రతి క్షణం పిల్లలే లోకంగా బతుకుతామని చెప్పాడు. మనకి సెలువులు దొరికినా పిల్లలకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లేందుకే ప్రయత్నిస్తామని, వారికి ఇష్టమైనవే చేస్తామని కార్తీ చెప్పాడు. ఇది ప్రతి ఒక్క మగాడి జీవితంలో చోటుచేసుకుంటుందని అన్నాడు. తన కుమార్తెకు తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా ఐదు భాషలను నేర్పిస్తానని చెప్పాడు. తనకు తమిళం, తెలుగు, ఇంగ్లిష్ మాత్రమే వచ్చని అన్నాడు.

  • Loading...

More Telugu News