: రేపటి నుంచి హైదరాబాద్‌లో 180 కి.మీ మేర రహదారుల పునర్నిర్మాణం
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమైన విషయం తెలిసిందే. పాడైపోయిన రోడ్లను తిరిగి బాగు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో ఈ పనులు మొదలు పెట్టనున్నారు. మొత్తం 180 కి.మీ మేర రహదారుల పునర్నిర్మాణం చేయనున్నారు. ఇందు కోసం రూ.75 కోట్లను ఖర్చు పెడుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసినా రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు పనులు కొనసాగించాలని యోచిస్తున్నారు.