: నా కుమార్తె టీనేజ్ గాళ్... తనకు నచ్చినట్టుంటే 'హాట్', 'వైల్డ్' అంటూ రాసేస్తారా?: మీడియాను ప్రశ్నించిన అమితాబ్ కుమార్తె


అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందాపై ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తలపై ఆమె తల్లి, అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ మీడియాను తప్పు పట్టారు. తన కుమార్తె ఫోటోలను ఆమె ఇన్ స్టా గ్రాం ఖాతా నుంచి తస్కరించి, హాట్, వైల్డ్ అంటూ వ్యాఖ్యానిస్తూ వార్తలు రాయడం సమంజసమా? అని శ్వేత బచ్చన్ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఇంకా ఆమె ఏమన్నారంటే... ‘నా కుమార్తె టీనేజ్‌ లో ఉంది. ఈ వయసులో అందరు అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో నా కుమార్తె కూడా అలాగే ప్రవర్తించింది. తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. స్నేహితులతో పార్టీలకు వెళ్తుంది. ఆ ఫొటోలను ఫేస్‌ బుక్‌ లో పెడుతుంది. బీచ్‌ కి వెళ్తుంది. స్విమ్‌ సూట్ వేసుకుంటుంది. అందులో తప్పేముంది? అంతమాత్రానికే, ‘నవ్య నవేలి హాట్, నవ్య నవేలి వైల్డ్’ అని వార్తలు రాస్తారా?’ అని ఆమె నిలదీశారు. తనకు తెలిసినంత వరకు తన కుమార్తె ఏ మాత్రం అసహజంగా ప్రవర్తించడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే స్టార్ కుటుంబానికి చెందిన యువతి కావడం వల్లే ఆమె గురించి ఇలా రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నవ్య నవేలీ నందా, షారూఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమ వ్యవహారం నడుపుతున్నారంటూ గతంలో మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News