: కందుల శివానందరెడ్డి కుమారుడిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి


కడప జిల్లాలో బీజేపీ నేత కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై వాసవి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదయం వన్ టౌన్ పీఎస్ కు వచ్చిన ఆమె, తనను ఓబుల్ రెడ్డి మాయమాటలతో మోసపుచ్చి, పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని కంప్లయింట్ ఇచ్చింది. గతంలో తాను శివానందరెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశానని, ఆ సమయంలో ఓబుల్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని, తనను ప్రేమించానని చెప్పిన ఓబుల్ రెడ్డి, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పింది. వాసవి ఫిర్యాదుపై కందుల ఓబుల్ రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు. కాగా, కేసు నమోదు చేసుకున్నామని, దర్యాఫ్తు చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News