: కేరళను ముంచెత్తుతున్న చైనా కృత్రిమ కోడిగుడ్లు... విచారణకు ఆదేశం


కేరళలో చైనా కృత్రిమ కోడిగుడ్ల అమ్మకాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ కృత్రిమ కోడిగుడ్లపై విచారణకు ఆదేశించారు. ఈ కోడిగుడ్లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని... కానీ, మీడియాలో వస్తున్న వార్తలను బట్టే విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. చైనా గుడ్లకు సంబంధించిన శాంపిల్ ఉంటే అధికారులకు అందించాలని కోరారు. తమిళనాడు నుంచి ఈ గుడ్లు కేరళకు వస్తున్నట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News