: చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న అరుణ్ జైట్లీ, అమిత్ షా
గత నెల 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. కొద్ది సేపట్లో వారు ఇరువురూ తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది.